News
మాస్టర్ ప్లాన్ వేశాం:కేటీఆర్
మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ వేశామని అన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ సమాధానం చెబుతూ.. రెండ్ అండ్ ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలు ఔటర్ రింగ్‌రోడ్ అవతలికి తరలిస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ కాలుష్య రహితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ లోపల 1545 పరిశ్రమలు గుర్తించామని, మొదటి దశలో 1960 పరిశ్రమలను తరలిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం జీహెచ్‌ఎంసీలో పైపు లైన్ల మార్పిడిపై సమాధానమిస్తూ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నీటి సరఫరాను మెరుగుపరుస్తున్నామన్నారు. పాడైన పాత పైప్ లైన్ తొలగించి కొత్తవి వేస్తున్నామని, పైప్‌లైన్ మరమ్మతుల కోసం హడ్కో నుంచి నిధులు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గ్రేటర్ పరిధిలో 1334 కి.మీటర్ల మేర పైప్‌లైన్ మార్చుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








